భారతీయ జనతా పార్టీకి చెందిన యువనేత వరుణ్ గాంధీ మరోమారు కేంద్ర ప్రభుత్వ వైఖరిని తూర్పారబట్టారు. కరోనా, ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా, రాత్రిపూట కర్ఫ్యూలు విధించుకోవచ్చని కేంద్రం సూచించడంపై ఆయన తనదైనశైలిలో స్పందించారు. పగలు వేలాది మందితో ర్యాలీలు నిర్వహించి, అందరూ హాయిగా నిద్రపోయే రాత్రి సమయంలో కర్ఫ్యూను అమలు చేయడమా? వాట్ ఏ లాజిక్? అంటూ ప్రశ్నించారు.
ఈ కారణంగానే ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆయన ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఆరోగ్య సౌకర్యాలు పూర్తిగా స్థాయిలో అందుబాటులో లేవని, మన ప్రధాన్యత ఒమిక్రా్ కేసుల తగ్గించడానికా? లేక ఎన్నికలా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.