గజరాజు దెబ్బకు గ్రామంలో 144 సెక్షన్ అమలు... ఎక్కడ?

బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (08:39 IST)
ఈమధ్యకాలంలో గజరాజులు వంటి అడవి జంతువులు జనావాస ప్రాంతాల్లోకి వచ్చి కాలనీల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా ఓ ఏనుగు దెబ్బకు గ్రామంలో ఏకంగా 144 సెక్షన్‌ను అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. 
 
ఈ ఏనుగు పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తూ తనకు కనిపించినవారిని చంపుకుంటూపోతోంది. గత 12 రోజుల్లో ఐదు రోజుల్లో ఏకంగా 16 మందిని బలితీసుకుంది. ఒక్క రాంచీలోనే నలుగురిని చంపేసింది. దీంతో అప్రమత్తమైన రెవెన్సూ, అటవీ అధికారులు పోలీసుల సహకారంతో ఈ ఏనుగును బంధించేందుకు వెస్ట్ బెంగాల్ నుంచి రాష్ట్రం నుంచి ప్రత్యేక బృందాన్ని రప్పిస్తున్నారు. 
 
మరోవైపు ఐదుగురికి మించి జనం కూడా గుమికూడకుండా రాంచీ జిల్లాలోని ఇటకీ బ్లాకులో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ప్రజలంతా తమతమ ఇళ్లలోనే ఉండాలని, సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ఇళ్ళలో నుంచి బయటకు రావొద్దని సూచించారు. అదేవిధంగా ఈ ఏనుగు దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున పరిహాలం ఇస్తున్నట్టు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శశికుమార్ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు