ఢిల్లీలో కర్ఫ్యూపాస్ లుంటనే బయటకు

మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (05:56 IST)
కరోనాను అరికట్టేందుకు దేశ రాజధాని ఢిల్లీలో లాక్ డౌన్ కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నారు ఢిల్లీ పోలీసులు. అనవసరంగా ఎవరైన బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

కర్ఫ్యూపాస్ లు ఉంటే మాత్రమే బయటకు రావాలని లేదంటే  2వేల రూపాయల జరిమానా, జైలు శిక్ష కూడా పడే అవకాశముందంటున్నారు. ఆస్పత్రికి వెళ్లేవారు గతంలో ఉన్న ఆస్పత్రి స్లిప్ చూపించాలన్నారు.

వైద్య సిబ్బందికి, మీడియా, నిత్యావసర సరుకు రవాణకు మాత్రమే మినాహాయింపు కల్పించారు. ఢిల్లీకి వచ్చే అన్ని రాష్ట్రాల జాతీయ రహదారులు మూసివేశారు పోలీసులు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు