ఆంఫన్ తుఫాను తీరం దాటింది.. చెట్లు విరిగి పడి కరెంటు తీగలు తెగిపోయాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఆంఫన్ తుపాను పశ్చిమ బెంగాల్‌లో తీరం తాకటం మొదలైందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. తుపాను ఊర్ధ్వ ఉపరితల ప్రాంతం పశ్చిమ బెంగాల్‌లో ప్రవేశించిందని, దిఘా పట్టణానికి తూర్పు ఆగ్నేయాన సుమారు 65 కి.మీ.ల దూరంలో ఇది తీరాన్ని తాకినట్లు వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ తుపాను తీరాన్ని తాకడం మొదలైందని, ఇది 4 గంటల పాటు కొనసాగుతుందని వివరించింది.