వేరొక మహిళతో తండ్రి రాసలీలలు.. కూతురు రాసలీలలను రికార్డు చేసి?

బుధవారం, 14 జూన్ 2017 (16:50 IST)
తండ్రి కుటుంబాన్ని కాపాడుతాడనుకున్నాడు. అయితే కుటుంబాన్ని లెక్కచేయలేదు. తల్లిని పక్కనబెట్టాడు. పిల్లలను పూర్తిగా మరిచిపోయాడు. వేరొక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. అంతే..ఇక కూతురు రంగంలోకి దిగింది. ధైర్యం చేసి.. వేరొక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న తండ్రికి బుద్ధిచెప్పాలనుకుంది. ఇక తండ్రి వేరొక మహిళతో చేసే రాసలీలలను రికార్డు చేసింది. ఆ వీడియోను తండ్రితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ భర్తకు చూపెట్టింది. ఆపై పోలీసులను పిలిపించింది. దీంతో వివాదం సద్ధుమణిగింది. 
 
భార్యాభర్తల అనుబంధం ఎంతో అమూల్యమైంది. తల్లికి అన్యాయం చేస్తున్నాడని తెలుసుకున్న కన్న కూతురు తండ్రి వేరే మహిళతో రాసలీలల్లో ఉన్న దృశ్యాలను సోదరుడి సహయంతో రహస్యంగా చిత్రీకరించింది. ఈ వీడియోను ఆ మహిళ ఇంటికి వెళ్ళి ఆమె భర్తకు చూపించింది. దీంతో ఆ మహిళను చితకబాదాడు భర్త. రెండు  కుటుంబాల మధ్య గొడవ చోటుచేసుకొంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. అయితే ఆ మహిళతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోనని పోలీసుల ముందే తండ్రితో చెప్పించి హామీ తీసుకోవడంతో ఆ తండ్రిని పోలీసులు వదిలిపెట్టారు.

వెబ్దునియా పై చదవండి