అమెరికాలోని కాలిఫోర్నియా కేఎఫ్‌సీ చికెన్ ఆర్డర్ చేస్తే చికెన్ ముక్క ఎలుక ఆకారంలో ఉండటం.. అచ్చం ఎలుక మాదిరి ఉన్న సదరు ఫోటో సోషల్ మీడియాలోనే కాదు.. పలుదేశాల్లో సంచలనం సృష్టించింది. ఈ సందర్భంగా కేఎఫ్సీ కిందామీదా పడింది. అసలీ వ్యవహారానికి కారణమైన కస్టర్ డిక్సన్ను కలిసేందుకు కేఎఫ్సీ తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తాజాగా అతని లాయర్ ఆ మాంసం ముక్కను ఓ ల్యాబ్కు అందించారు. అయితే.. సదరు ల్యాబ్ వారి నివేదిక ప్రకారం.. అది ఎలుక మాంసం కాదని.. చికెన్ ముక్కేనని తేల్చారు. దీంతో ఆ వివాదం సద్దుమణిగింది.
కానీ భారత్‌లో తాజాగా మెక్‌డొనాల్డ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌కు చిక్కొచ్చిపడింది. కోల్‌కతాలో నివసించే ప్రియాంక అనే మహిళ తన కుమార్తెను వెంటబెట్టుకుని ఫాస్ట్‌పుడ్ తినడానికి మెక్‌డొనాల్డ్ ఔట్‌లెట్‌కు వెళ్లింది. అక్కడ ఫ్రెంచ్ ఫ్రై ఆర్డరిచ్చి.. వచ్చాక హ్యాపీగా లాగించేశారు. అయితే ఇద్దరు తింటుండగా.. ప్రియాంక కుమార్తె.. ఆహారంలో బాగా ఫ్రై అయిపోయిన బల్లిని గుర్తించింది.