అమర్ నాథ్ మంచు శివలింగాన్ని దర్శించి పూజలు చేసిన రాజ్‌నాథ్ సింగ్

శనివారం, 18 జులై 2020 (14:05 IST)
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం అమర్‌నాథ్ పవిత్ర గుహను సందర్శించి ప్రార్థనలు చేశారు. మంత్రి అక్కడి ఆలయ సముదాయంలో ఒక గంట గడిపాడు. అమర్‌నాథ్ గుహ హిందూ మతంలో పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడి పర్వత భూభాగాల్లో ఏటా వేలమంది భక్తులు తీర్థయాత్ర చేస్తారు.
 
శుక్రవారం, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జమ్మూ కాశ్మీర్‌లోని మొత్తం భద్రతా పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన పాకిస్తాన్ చేసే ఏదైనా దుశ్చర్యకు తగిన సమాధానం ఇవ్వమని సాయుధ దళాలను కోరారు. పాకిస్థాన్‌తో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంట కఠినమైన జాగరూకతతో ఉండాలని రక్షణ మంత్రి కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు