దేశ రాజధాని ఢిల్లీలో ఓ వింత కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ యువతి తనపై అత్యాచారం చేసిందంటూ మరో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెక్స్ టాయ్‌తో ఓ యువతి తనపై పలుమార్లు రేప్ చేసిందంటూ 25 యేళ్ళ వయసున్న మరో యువతి చేసిన ఫిర్యాదులో పేర్కొంది. అయితే, దీనిపై కేసు నమోదు చేయలేక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
సెక్స్ టాయ్స్‌తో ఓ యువతి తనపై ఆమె పలుమార్లు అత్యాచారానికి పాల్పడిందంటూ మరో యువతి (25) పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, స్వలింగ సంపర్కం నేరం కాదంటూ 377 సెక్షన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ఏ చట్టం కింద కేసు నమోదు చేయాలని పోలీసులు ఆమెను ఎదురు ప్రశ్నించారు.
ఢిల్లీకి చెందిన 25 యేళ్ళ యువతి ఆన్‌లైన్ వస్త్రవ్యాపారం చేస్తోంది. గత మార్చిలో రోహిత్ అనే వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు. అతడు పెట్టుబడి ఆశచూపి.. స్నేహితుడు రాహుల్‌తో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారం చేశాడు. ఆ దారుణాన్ని వీడియో తీసి బెదిరింపులకు గురిచేసి, ఆమెతో ఓ ఇంట్లో వ్యభిచారం చేయించాడు.
అక్కడ ఓ 19 ఏళ్ల యువతి తనపై సెక్స్‌టాయ్స్‌తో ఘోరానికి పాల్పడేదని.. వినకపోతే తీవ్రంగా కొట్టేదని బాధితురాలు ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించి రోహిత్, రాహుల్‌తో పాటు సాగర్ అనే మరో యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు ఆరోపించిన యువతిపై మాత్రం కేసు పెట్టలేదు.