ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిందొకటి.. వచ్చింది వేరొకటి.. వీడియో చూడండి..
శనివారం, 18 జూన్ 2022 (15:05 IST)
onions
ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఓ వ్యక్తికి చుక్కలు కనిపించాయి. తనకిష్టమైన ఫుడ్‌ను ఆర్డర్ చేసిన వ్యక్తికి వచ్చిన ఆర్డర్ చూసి షాక్ అవ్వక తప్పలేదు.
వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి తనకు ఇష్టమైన ఫుడ్ తినేందుకు ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టాడు. సీన్ కట్ చేస్తే ఇంటికొచ్చిన పార్శిల్ చూసి షాకయ్యాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన ఉబైడ్ అనే వ్యక్తి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా ఫ్రైడ్ ఆనియన్ రింగ్స్ ఆర్డర్ పెట్టాడు. ఆర్డర్ కోసం ఎదురుచూశాడు. ఆర్డర్ కూడా వచ్చేసింది.
అంతే ఓపెన్ చేసి చూస్తే షాక్. ఆరు ఫ్రైడ్ ఆనియన్ రింగ్స్‌కు బదులుగా, ఓ చిన్న బాక్సులో ఉల్లిపాయ ముక్కలు ఆరు వచ్చాయి. ఈ విషయాన్ని అతడు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నెట్టింట షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.