ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ గెలుపు.. బీజేపీ రికార్డ్ బ్రేక్

బుధవారం, 7 డిశెంబరు 2022 (15:11 IST)
Delhi MCD Election Results 2022
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయఢంకా మోగించింది. ఈ నెల 4వ తేదీన ఈ ఎన్నికలు జరిగాయి. బుధవారం ఉదయం 8 గంటలకు ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. 
 
ఆమ్ ఆద్మీ పార్టీ మొదటి నుంచి అత్యధిక స్థానాల్లో ముందంజలో నిలిచింది. మొత్తం 250 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఆప్ 133 స్థానాలు సొంతం చేసుకుంది. మ్యాజిక్ ఫిగర్ 126 కాగా, ఆప్ 7 స్థానాలు ఎక్కువే గెలుచుకుంది.

అలాగే బీజేపీ 101 వార్డుల్లో నెగ్గింది. ఆప్, బీజేపీ మధ్య సాగిన ఈ పోరులో కాంగ్రెస్ కేవలం 8 స్థానాలతో సరిపెట్టుకుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో గత పదిహేను సంవత్సరాలుగా బీజేపీనే నెగ్గుతూ వచ్చింది. ఈ రికార్డును ఆమ్ ఆద్మీ బ్రేక్ చేసింది. 
 
దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు టపాకాయలు పేల్చి, మిఠాయిలు పంచుతూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ పరిస్థితిలో, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తన విజయం కోసం కృషి చేసిన వారికి, పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు