ఏ క్షణం ఏం జరుగుతుందో వూహించలేకుండా.. ఎవరి రాత ఎలా మారిపోతుందో అంచనాలకు అందకుండా.. ప్రతి నిమిషం ఉత్కంఠగా ప్రతి కదలికలోనూ ఏదో ఒక విశేషాన్ని నింపుకున్న షో "బిగ్ బాస్". తెలుగు ప్రేక్షకులకు స్టార్ మా అందిస్తున్న ఈ షో లో ఇప్పుడు తొమ్మిదో సీజన్ (బిగ్ బాస్ సీజన్ 9) ఎన్నో ప్రత్యేకతలతో సిద్ధమవుతోంది. ఇన్ని సీజోన్లుగా బిగ్ బాస్‌ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఇవ్వాలనుకుంటున్న రిటర్న్ గిఫ్ట్‌తో హోస్ట్ నాగార్జున చేసిన ప్రోమో పెద్ద సంచలనమే సృష్టించింది.