ఢిల్లీ నజాఫ్‌ఘడ్ పరిధిలోని ప్రేమ్‌నగర్‌లో ఓ తల్లితో పాటు.. కుమార్తె, కుమారుడు నివశిస్తున్నారు. వీరిలో తల్లి సునీతకు 40 ఏళ్లు, కుమార్తెకు 15 యేళ్లు ఉన్నాయి. వీరిద్దరూ కలిసి గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన కుమారుడు.. తమ కుటుంబ పరువు తీస్తున్నాడని భావించారు. అంతే... తన ఇద్దరు స్నేహితులతో కలిసి పథకం పన్ని హతమార్చాడు.
సునీత కుమారుడైన సుమీత్ తన ఇద్దరు స్నేహితులైన ధర్మాబీర్ (28), ప్రదీప్ (15)లతో కలిసి తల్లీ, చెల్లిని చంపాడని పోలీసులు చెప్పారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం సునీతతోపాటు ఆమె కూతురిని రాజస్థాన్ రాష్ట్రంలోని సికర్‌లో ఉన్న ఖటుశ్యాం దేవాలయ సందర్శనకు ధర్మాబీర్ తన కారులో తీసుకువచ్చాడు.
అక్కడికి సమీపంలోని మానేసర్ లోని ఇండస్ట్రియల్ మోడల్ టౌన్ షిప్ ప్రాంతంలో తల్లీ కూతుళ్లను ముగ్గురు యువకులు కలిసి వారికి దుపట్టా చుట్టి దేశీ తుపాకులతో కాల్చి చంపారు. వారి మృతదేహాలను మైదానంలో పడేసి ఏమీ ఎరగనట్లు ఢిల్లీకి తిరిగివచ్చారు. పోలీసులు అనుమానంతో సుమిత్ ను పట్టుకొని ప్రశ్నిస్తే అసలు హత్య విషయం వెలుగు చూసింది.