ట్రాఫిక్‌తో విసుగు చెంది బైకును మోసుకుంటూ వెళ్ళిన యువకుడు..

ఠాగూర్

గురువారం, 4 సెప్టెంబరు 2025 (15:23 IST)
దేశ రాజధాని ఢిల్లీతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల గురుగ్రామ్‌లో రెండు గంటల పాటు వర్షం దంచి కొట్టింది. దీంతో జాతీయ రహదారిపై వాహనాలు కొన్ని గంటల పాటు చిక్కుకునిపోయాయి. దాదాపు 7 కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు ఆరేడు గంటల సమయం పట్టిందని వాహనదారులు వాపోయారు. 
 
ఈ క్రమంలో ఓ ద్విచక్రవాహనదారుడు చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ట్రాఫిక్‌లో చిక్కుకుని గంటల తరబడి వేచివున్న ఒక యువకుడు విసిగిపోయి తన బైకును నెత్తిపై మోసుకుంటూ వెళ్లాడు. తోడుగా మరో యువకుడు నడుస్తుండగా, బైకును మోసుకుంటూ వెళుతున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు