వివరాల్లోకి వెళ్తే... సిడ్పా గ్రామానికి చెందిన రాజేంద్ర ఒరాన్ అనే యువకుడిని ఓ పాము కరిచింది. వెంటనే కుటుంబ సభ్యులు అతనిని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. దీనిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేసి, ఆసుపత్రి ముందు ఆందోళన చేశారు.
వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే రాజేంద్ర మృతి చెందాడని మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయితే వైద్యులు శవాన్ని గ్రామానికి తరలించేందుకు అంబులెన్స్ ఇచ్చేది లేదన్నారు. బతిమాలినా ప్రయోజనం లేకపోవడంతో మృతుడి అన్న, వదినలు తామే శవాన్ని మోశారు. స్థానికుల సాయంతో రాజేంద్ర శవం గ్రామానికి చేరింది. అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ ఫోటోలు వైరల్ కావడంతో ఇద్దరు అధికారులపై వేటు పడింది.