దీనిపై ఇప్పటివరకు అధికారులు అధికారికంగా ప్రకటన ఇవ్వనప్పటికీ... ధోనీ జెండా ఎగుర వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం పుల్వామా జిల్లా క్రూ ప్రాంతంలో పారా రెజిమెంట్ యూనిట్ బాధ్యతలు నిర్వహిస్తున్న ధోనీ... ఈ నెల 10వ తేదీన తన బృందంతో కలిసి లడఖ్ లోని లేహ్ ప్రాంతానికి వెళ్లనున్నాడని ఓ సైనికాధికారి చెప్పారు.
భారత ఆర్మీకి ధోనీ బ్రాండ్ అంబాసిడర్ అని ఓ సైనికాధికారి అన్నారు. ప్రస్తుతం ధోనీ తాను విధులు నిర్వహిస్తున్న చోట తన బృంద సభ్యులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడని కొనియాడారు. వారితో కలిసి ఫుట్ బాల్, వాలీబాల్ ఆడుతున్నట్లు చెప్పారు. అలాగే సైనిక బలగాలతో కలిసి ఆర్మీ విధుల్లో పాల్గొంటున్నట్లు చెప్పారు. ఆగస్టు 15వరకు ధోనీ తన విధుల్లో కొనసాగుతాడని వారు తెలిపారు.