దినకరన్ పనైపోయింది.. ఒక్కో ఎమ్మెల్యేగా జంప్.. ఎందుకు..?

శుక్రవారం, 18 ఆగస్టు 2017 (16:13 IST)
శశికళ మేనల్లుడు టి.టి.వి.దినకరన్ పనైపోయింది. దినకరన్ వెంట ఉన్న 14 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపిలు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. మూడురోజుల క్రితం మధురైలో జరిగిన ఒక సమావేశంలో తన వెంట అన్నాడిఎంకే ఎమ్మెల్యేలు మరింతమంది ఉన్నారని, వారందరూ కూడా వచ్చేస్తారని దినకరన్ ధీమాతో చెప్పారు. అయితే అది ప్రస్తుతం కనిపించడం లేదు. కారణం పన్నీరుసెల్వం, పళణిస్వామిలు కలిసిపోతుండటంతో దినకరన్ పప్పులు ఉడికేటట్లు కనిపించడం లేదు.
 
పన్నీరుసెల్వం డిమాండ్లకు తలొగ్గి పళణిస్వామి అన్నింటికీ ఒకే చెప్పడంతో పాటు వాటిని అమలు కూడా చేస్తుండటంతో దినకరన్‌కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఎలాగైనా ఆర్.కే నగర్ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిపోదామనుకున్న దినకరన్‌కు ఎన్నికల కమిషన్ రూపంలో అడ్డు తగిలింది. జైలుకు వెళ్ళి బయటకు వచ్చిన తరువాతైనా ఎలాగోలా పార్టీని తనవైపు తిప్పుకుందామని ప్రయత్నం చేశాడు.
 
అయితే పళణిస్వామి మాత్రం తన ముఖ్యమంత్రి పదవికి ఎవరూ ఎసరు పెట్టకూడదని తన శత్రువైన పన్నీరుసెల్వంతోనే కలవడానికి సిద్ధమయ్యాడు. దీంతో దినకరన్‌కు లేవలేని దెబ్బ తగిలినట్టయింది. ఇదిలా ఉంటే వీరిద్దరూ కలవడంతో దినకరన్ వెంట ఉన్న ఎమ్మెల్యేలందరూ పళణిస్వామి దగ్గరకే వెళ్ళేందుకు సిద్ధమైపోయారట. ఒక్కొక్కరు జంప్ అవ్వడానికి సిద్థంగా ఉన్నారట. మరి దినకరన్ జంప్ అవ్వనున్న ఎమ్మెల్యేలను ఎలా పట్టుకుని మిగిలిన ఎమ్మెల్యేలు ఎలా తనవైపు తిప్పుకుంటారో వేచి చూడాల్సిందే.

వెబ్దునియా పై చదవండి