మహిళలపై అత్యాచారాలు, దురాగతాలు జరుగుతూనే వున్నాయి. తమిళనాడులో ఓ ట్రైనర్.. విద్యార్థినిని రెండో అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, కోయంబత్తూరులోని ఓ కాలేజీలో నిర్వహించిన మాక్ డ్రిల్, ఓ విద్యార్థిని నిండు ప్రాణాన్ని బలిగొంది. ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా బయట పడాలనే విధానాన్ని ఆ మాస్టర్ పిల్లలకు నేర్పుతున్నాడు.
ఈ మేరకు డ్రిల్ మాస్టర్ కళైమగన్ ఆర్ట్స్ కళాశాలలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కింద విద్యార్థులంతా ఓ నెట్ పట్టుకుని నిల్చుండగా, రెండో అంతస్తు నుంచి లోకేశ్వరి అనే విద్యార్థిని కిందకు దూకేందుకు అంగీకరించింది. ఆపై రెండో అంతస్థు నుంచి ఆమె దూకేందుకు అనుమానిస్తుండగానే.. ట్రైనర్ ఆమెను దూకేయాల్సిందిగా ప్రోత్సహించాడు.