ఎన్నికల అఫిడవిట్‌లో అసత్యాలు.. ఈసీని తప్పుదోవ పట్టించిన అమిత్ షా

ఆదివారం, 7 ఏప్రియల్ 2019 (10:07 IST)
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా చిక్కుల్లో పడ్డారు. ఆయన సమర్పించిన నామినేషన్ అఫిడవిట్‌లో అసత్యాలు పేర్కొన్నట్టు సమాచారం. ఈ విషయంలో ఎన్నికల సంఘాన్ని సైతం తప్పుదారి పట్టించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది. 
 
ఎన్నికల అధికారికి సమర్పించిన అఫిడవిట్‌లో అమిత్‌ షా తప్పుడు వివరాలు పొందుపరిచారని.. ఆయనపై అనర్హత వేటు వేయాలని తన ఫిర్యాదులో కోరింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.66.7 లక్షల విలువ ఉన్న ఆస్తిని అమిత్ షా తన అఫిడవిట్‌లో రూ.25లక్షలుగా పేర్కొన్నారని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. 
 
అలాగే, గాంధీనగర్‌లో ఒక ప్లాట్, ఓ కమర్షియల్ బ్యాంకు నుంచి తీసుకున్న రుణానికి సంబంధించి అమిత్ షా అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు పొందుపరిచినట్టు పేర్కొంది. షా తన కుమారుడి బిజినెస్ కోసం రెండు ప్రాపర్టీలను కమర్షియల్ బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.25 కోట్లు రుణం పొందారని.. ఆ వివరాలను కూడా అఫిడవిట్‌లో తప్పుగా పొందుపరిచారని పేర్కొంది. దీంతో అమిత్ షా సమర్పించిన అఫిడవిట్‌ను ఈసీ మరోమారు పరిశీలించనుందనే వార్తలు వస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు