కరోనా తీవ్రత, అత్యంత విషమంగా ఉన్న బాధితులకు వేర్వేరుగా చికిత్స అందిస్తాం. కరోనా లక్షణాలు ఉన్నవారిని కొవిడ్ కేర్ సెంటర్లకు తరలిస్తాం. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న బాధితులకు ప్రత్యేక ఆస్పత్రుల్లో చికిత్స చేయిస్తాం’’ అని వివరించారు.
మరోవైపు కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్ కొనసాగించాలంటూ తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక ప్రభుత్వాలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. ఆర్ధిక వ్యవస్థను నెమ్మదిగానైనా చక్కదిద్దుకోవచ్చని, ప్రజల ప్రాణాలు కాపాడుకోవడమే ప్రస్తుతం ముఖ్యమని తెలంగాణ సీఎం కేసీఆర్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కోరారు.