జయలలిత వంట మనిషిపై మారణాయుధాలతో దాడి.. ఎవరై ఉంటారు..?

ఆదివారం, 14 మే 2017 (17:16 IST)
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో సెక్యూరిటీ హత్య, ఆపై అమ్మ డ్రైవర్ రోడ్డు ప్రమాదంలో మరణించిన ఘటనలు మరిచిపోకముందే.. జయమ్మ నివాసంలో వంటమనిషిగా పనిచేసిన పంజవర్ణం అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అయితే ఈ దాడిలో వంటమనిషి ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నారు. 
 
శనివారం నాడు కూడ గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధాలతో అతనిపై దాడికి పాల్పడ్డారు. అయితే ఈ ప్రమాదం నుండి ఆయన తృటిలో తప్పించుకొన్నాడు. శివగంగ జిల్లాకు చెందిన పంచవర్ణం జయ ఇంట్లో వంటమనిషిగా పనిచేశారు.
 
పంచవర్ణం కుమారుడు అన్నాడిఎంకె ప్రభుత్వహయాంలో పౌరసంబంధాల శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ దాడికి సంబంధించి సైదాపేట పోలీసులు కేసును తీసుకోకపోవడంతో బాధితులు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఆళగును మురుగేషన్‌ను ఆశ్రయించారు.

వెబ్దునియా పై చదవండి