ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టాక ప్రభుత్వ పనులు చకచకా సాగిపోతున్నాయి. ప్రభుత్వాధికారులకు కచ్చితమైన ఆదేశాలను జారీ చేయడం ద్వారా యోగి.. స్ట్రిక్ట్ సీఎం అనిపించుకుంటూ.. ప్రజలచే మంచి మార్కులు వేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారి ఫూటుగా తాగి చిందులేసిన వీడియో లీక్ కావడంతో.. యోగి ఆతనిని సస్పెండ్ చేసేందుకు ఆదేశాలిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని పోలీసు అధికారులు అనుకుంటున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. ఓ డ్యాన్స్ ప్రోగ్రామ్‌కి బందోబస్తు కోసం వెళ్లిన ఓ పోలీస్ అధికారి ఫూటుగా మందుకొట్టాడు. స్టేజ్ ఎక్కి బార్ గార్ల్స్‌తో చిందులేసి అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అయ్యింది. యూపీలోని శ్రావస్తి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బందోబస్తు కంటూ వెళ్లిన పోలీసు ఫూటుగా తాగేసి బార్ గర్ల్స్ చిందులేయడంతో ఆపకుండా డబ్బులు కూడా విసిరాడు.