అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌కు ఎన్నికల సంఘం (ఈసీ) షాకిచ్చింది. శశికళను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా నియమించడంపై దాఖలైన వాదనను ఈసీ తిరస్కరించింది. ఈ వాదనను సమర్పించిన శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ తమ వద్దనున్న ఆ పార్టీ ఆఫీస్ బేరర్ల జాబితాలో లేకపోవడమే తిరస్కరణకు కారణమని ఈసీ పేర్కొంది.
ఈ వ్యవహారంలో శశికళ స్వయంగా సమాధానం చెప్పాలని కూడా ఈసీ వెల్లడించింది. అదీ ఈ నెల పదోతేదీ లోపు ఆ సమాధానం తమకు చేరాలని ఈసీ స్పష్టం చేసింది. ఈసీ గత నెల 17న ఇచ్చిన నోటీసుకు శశికళ మేనల్లుడు దినకరన్ స్వయంగా సంతకం చేసి దాఖలు చేశారు. ఆయన్ని పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా శశికళ కర్ణాటక జైలుకు వెళ్ళేముందు నియమించారు.