మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అయితే ముంబై రైల్వే స్టేషన్‌లో బ్రిడ్జి కూలి తొక్కిసలాటలో ప్రాణాలు దక్కించుకునేందుకు జనాలు పరుగులు పెడుతున్నారు. ఆ సమయంలో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన చోటుచేసుకుంది. వీరు మనుషులేనా? అనిపించేలా ప్రవర్తించాడు. ఆర్తనాదాలు చేస్తుంటే మహిళల వద్ద దోచుకెళ్లారు.
వివరాల్లోకి వెళితే.. ముంబై తొక్కిసలాటలో ఓ మహిళ కింద పడి చావుబతుకుల మధ్య పోరాడుతుంటే ఆమెను రక్షించాల్సిన సాటి వ్యక్తులు మానవ మృగాల్లా ప్రవర్తించారు. ఆమెను అసభ్యంగా తాకుతూ, ఆమె ఒంటిపై ఉన్న నగలను కాజేసి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఆమె ఆర్తనాదాలు ఎవరినీ కదిలించలేకపోయాయి. ఈ ఘటన జరిగిన కాసేపటికే ఆమె ప్రాణాలు విడిచింది.