కానీ, ఇపుడు రంజన్ గగోయ్‌ను మాత్రం కేంద్ర ప్రభుత్వం పెద్దల సభకు నామినేట్ చేసింది. ఇపుడుడ ఈ విషయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే, రాష్ట్రపతి ఇచ్చిన ఈ అవకాశాన్ని ఎందుకు స్వీకరించాల్సి వచ్చిందో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే వివరంగా చెబుతానని జస్టిస్ గొగోయ్ అంటున్నారు.
ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. "నేను రేపు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. మొదట నన్ను ప్రమాణ స్వీకారం చేయనీయండి. ఆ తర్వాతే మీడియాతో మాట్లాడుతా. ఈ సభ్యత్వాన్ని ఎందుకు అంగీకరించాల్సి వచ్చిందో స్పష్టంగా చెబుతా" అని ఆయన తెలిపారు. దాదాపు 13 నెలల పాటు సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన రంజన్ గతేడాది నవంబర్‌లో పదవీ విరమణ చేసిన విషయం తెల్సిందే.