ముకేశ్ అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాల కలకలం..!

గురువారం, 25 ఫిబ్రవరి 2021 (22:27 IST)
ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. ఆయన నివాసానికి సమీపంలో గురువారం పేలుడు పదార్థాలున్న స్కార్పియో వాహనాన్ని గుర్తించారు. ఈ వాహనాన్ని తొలుత ఆయన భద్రతా సిబ్బంది గుర్తించినట్లు సమాచారం.
 
అనంతరం వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అప్రమత్తమయ్యారు. బాంబు నిర్వీర్య బృందాలు(డిస్పోజల్ స్కాడ్స్) అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించాయి. ఆ వాహనాన్ని అక్కడ ఎవరు పార్క్ చేశారు, తదితర వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.
 
కాగా ఈ కారులో జిలెటిన్ స్టిక్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. దీనిపై ముంబయి క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తున్నారన్నారు. దర్యాప్తులో పూర్తి వాస్తవాలు తెలుస్తాయన్నారు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో భద్రతను పెంచారు. సీనియర్ పోలీసు అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు