బిర్యానీ తినేందుకు వెళ్ళిన ఓ బాలుడు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఢిల్లీకి చెందిన ఓ ఏడేళ్ల బాలుడు స్నేహితులతో కలిసి జందేవాలన్ సమీపంలో ఉన్న ఫైజ్ రోడ్డులోని ఎంసీడీ కాంప్లెక్స్‌కు వెళ్లాడు. అయితే కార్పోరేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల ఆ నిండు ప్రాణం బలైపోయింది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన ఓ ఏడేళ్ల బాలుడు స్నేహితులతో కలిసి జందేవాలన్ సమీపంలో ఉన్న ఫైజ్ రోడ్డులోని ఎంసీడీ కాంప్లెక్స్‌లో బిర్యానీ తినడానికి వెళ్లాడు.
అదే సమయంలో.. బిర్యానీ షాపును ఆనుకుని ఉన్న ఎంసీడీ కాంప్లెక్స్ గోడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నిర్మాణ పనులకు అడ్డుగా ఉన్న ఓ చెట్టును తొలగించడానికి ప్రయత్నించారు అధికారులు. దీంతో చెట్టు కొమ్మలన్ని బిర్యానీ షాపుపై ఒరిగాయి. ఆపై అప్పటికే స్వల్పంగా ధ్వంసమై ఉన్న గోడ కాస్త... బిర్యానీ తింటున్న బాలుడితో పాటు పలువురిపై కూలిపోయింది. ఈ దుర్ఘటనలో బాలుడు అక్కడిక్కడే చనిపోగా.. మరో ఏడుగురు గాయపడ్డారు.