టీవీ చూస్తే రూ.1000 అపరాధం.. ఫత్వా జారీ చేసిన గ్రామ కమిటీ

శనివారం, 22 ఆగస్టు 2020 (15:34 IST)
ముస్లి చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ముఖ్యంగా, ముస్లిం గ్రామ కమిటీలు చెప్పేదే వేదం. ఆ కమిటీలు చేసే చట్టాలు లేదా జారీచేసే ఫత్వాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం లేదా అపరాధం విధించడం జరుగుతుంది. తాజాగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కూడా ఓ ముస్లిం కమిటీ ఫత్వా జారీచేసింది. ముస్లిం మహిళలు టీవీ చూస్తే రూ.వెయ్యి అపరాధం చెల్లించాలని ఫత్వా జారీచేసింది. అంతేకాకుండా, తాము విధించిన కట్టుబాట్లను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వెస్ట్ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో ముస్లిం ప్రాబల్య గ్రామ కమిటీ తాజాగా కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుని ఫత్వా జారీచేసింది. గ్రామంలో ఎవరైనా టీవీ చూసినా, క్యారమ్స్ ఆడినా, మద్యం, లాటరీ టికెట్లు కొన్నా, మ్యూజిక్ విన్నా జరిమానా తప్పదంటూ ఫత్వాలో హెచ్చరించింది. 
 
ఈ మేరకు గ్రామ సామాజిక సంస్కరణల కమిటీ గ్రామంలో ఈ నెల 9న బ్యానర్లు ఏర్పాటుచేసింది. ఇందులో భాగంగా చేసిన తప్పుకు రూ.500 నుంచి రూ.7 వేలకు జరిమానాలు విధించనున్నట్టు తెలిపింది. దీంతో పాటు చెవులు పట్టుకుని గుంజీలు తీయడం, శిరోముండనం వంటి శిక్షలు కూడా ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది.
 
కాగా, వివిధ నేరాలకు పాల్పడేవారికి విధించే శిక్షలను పరిశీలిస్తే, టీవీ చూడడం, మొబైల్ ఫోన్, కంప్యూటర్‌లలో మ్యూజిక్ వింటే రూ.1,000 అపరాధం విధిస్తారు. అలాగే, కేరమ్స్ ఆడితే రూ.500, లాటరీ టిక్కెట్ కొనుగోలు చేస్తే రూ.2 వేలు, మద్యం అమ్మితే రూ.7 వేల అపరాధంతో పాటు శిరోముండనం చేసి గ్రామంలో ఊరేగిస్తారు. 
 
లాటరీ టికెట్లు విక్రయిస్తే రూ.7 వేలు, మద్యం సేవిస్తే రూ.2 వేల జరిమానా, చెవులు పట్టుకుని పది గుంజీలు తీయాల్సివుంటుంది. అలాగే, గంజాయి కొనుగోలు చేసినా, విక్రయించినా రూ.7 వేలు జరినామా విధిస్తారు. ముఖ్యంగా, ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారికి సంబంధించిన సమాచారం అందిస్తే తప్పును బట్టి రూ.200 నుంచి రూ.2 వేల వరకు నగదు బహుమతి ఇస్తామని కూడా గ్రామ కమిటీ వెల్లడించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు