ప్రముఖ మ్యూజిక్ యాప్ గూగుల్ ప్లే మ్యూజిక్ ఇక కనుమరుగు కానుంది. దీన్ని శాశ్వతంగా మూసివేయాలని గూగుల్ నిర్ణయించింది. తొలుత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ఈ సెప్టెంబర్ నుంచి.. మిగిలిన దేశాల్లో అక్టోబర్ నుంచి ఈ యాప్ ఇక పనిచేయదు. డిసెంబర్ తర్వాత ఇందులో డేటా మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని గూగుల్ ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుతం గూగుల్‌కు చెందిన గూగుల్ ప్లే మ్యూజిక్, యూట్యూబ్ మ్యూజిక్ రెండూ ఒకేరకమైన సేవలందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకే తరహా యాప్‌లు రెండు అవసరం లేదని భావించిన గూగుల్.. గూగుల్ ప్లే మ్యూజిక్‌కు స్వస్తి చెప్పాలని నిర్ణయించింది.