అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌కు సుప్రీంకోర్టు గట్టివార్నింగ్ ఇచ్చింది. తమ వద్ద పిచ్చిపిచ్చి వేషాలు వేయొద్దంటూ హెచ్చరించింది. విదేశీ మారకద్రవ్య నియంత్రణ చట్టం (ఫెరా) ఉల్లంఘన కేసులో దినకరన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. పైగా, కేసు దర్యాప్తు మూడు నెలల్లోగా పూర్తి చేయాలని మద్రాస్ హైకోర్టు ఇదివరకే ఆదేశాలు ఇచ్చింది. కేసు విచారణ ఎదుర్కోవాలని దినకరన్‌కు సూచించింది.
దినకరన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఫెరా ఉల్లంఘన కింద రెండు కేసులు నమోదు చేసింది. రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా అమెరికా డాలర్లను బ్రిటన్‌లోని ఓ కంపెనీకి మళ్లించారన్నది ప్రధాన ఆరోపణగా ఉంది. దీంతో పాటు 44.37లక్షల పౌండ్లు విదేశాల్లో లావాదేవీలు నిర్వహించినట్లు మరో కేసు కూడా ఈడీ నమోదు చేసింది.