దేశంలో దురాగతమైన దుశ్చర్యలు ఎక్కువవుతున్నాయి. అమ్మాయిలపై అత్యాచారాలు, ర్యాగింగ్‌లు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఈ రెండు విషయాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన శిక్షలు విధిస్తున్నా.. అవగాహన చర్యలు చేపడుతున్నా.. నిర్భయ చట్టం వంటి కేసులు నమోదు చేస్తున్నా ఇవి ఇంకా పెరుగుతూనే ఉన్నాయేగానీ ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ర్యాగింగ్‌లో భాగంగా సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థుల చేత దారుణమైన పనులు చేయిస్తున్నారు.
తాజాగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ విద్యార్థినిని ర్యాగింగ్ పేరుతో దుస్తులు విప్పించిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆ వివరాలను పరిశీలిస్తే... జోధ్‌పూర్‌కు చెందిన ఓ ప్రైవేట్ స్కూల్లో ఓ విద్యార్థిని చేరింది. అదే స్కూల్లో చదువుతున్న ఐదుగురు విద్యార్థినులు నీ అందాలను చూడాలని ఉంది బట్టలు విప్పమని చెప్పారు. దీనికి ఆ విద్యార్థిని ససేమిరా కుదరదని చెప్పడంతో... ఆ విద్యార్థినిని బలవంతంగా బాత్‌రూమ్‌లోకి లాక్కెళ్లి బట్టలు విప్పించారు.
ఈ ఘటనతో బాధపడిన ఆ బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పి వాపోయింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ ఐదుగురు విద్యార్థినిలపై స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. రాజస్థాన్‌లో రాష్ట్రంలో ఆల్రెడీ ర్యాగింగ్ చట్టం అమలులో ఉన్నప్పటికీ ఇది కేవలం కాలేజీ విద్యార్థులకే పరిమితమైంది.