హైదరాబాద్ నుంచి అమెరికా జాతీయుల కోసం ప్రత్యేక రిలీఫ్ విమానం

మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (18:39 IST)
ప్రపంచం మొత్తం కోవిడ్-19 మహమ్మరి బారిన చిక్కుకున్న ఇలాంటి విపత్కర సమయంలో, భారతదేశం మొత్తం లాక్ డౌన్‌లో ఉన్న సందర్భంలో, కోవిడ్-19 రిలీఫ్ మరియు తరలింపు విమానాలను హ్యాండిల్ చేస్తూ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి తన వంతు సేవలను అందిస్తోంది. 
 
దీనిలో భాగంగా నేడు హైదరాబాద్ నుంచి కొందరు అమెరికా జాతీయులను వారి స్వదేశానికి తరలించేందుకు వచ్చిన ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం హైదరాబాద్ విమానాశ్రయంలో దిగింది.

ఈ AI 1617(అరైవల్)/AI 1618(డిపార్చర్), ఎయిర్ బస్ A-320 ప్రత్యేక విమానం మధ్యాహ్నం 3.12 గంటల సమయంలో ముంబై నుంచి హైదరాబాద్‌లో దిగి, ప్రయాణికులను ఎక్కించుకుని తిరిగి సాయంత్రం 4.15 గంటల సమయంలో ముంబై తిరిగి వెళ్లింది. 
 
ఈ డొమెస్టిక్ విమానం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ నుంచి ఆపరేట్ చేశారు. ఇక్కడి నుంచి వెళ్లిన ప్రయాణికులు డెల్టా ఎయిర్ ద్వారా ముంబై నుంచి అమెరికాలోని వారి గమ్యస్థానాలకు చేరతారు. 
 
ఈ తరలింపులో భాగంగా అమెరికా కాన్సులేట్ మరియు తెలంగాణ ప్రభుత్వ సమన్వయంతో 99 మంది అమెరికా జాతీయులు (98 మంది పెద్దలు, ఒక శిశువు) హైదరాబాద్‌లోని వివిధ ప్రదేశాల నుంచి సుమారు మధ్యాహ్నం 1 గంట సమయంలో విమానాశ్రయానికి వచ్చారు. ఈ ప్రయాణికుల కోసం పూర్తిగా శానిటైజ్ చేసిన ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్‌ను సిద్ధంగా ఉంచారు. 
 
ఈ అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి, చిక్కుకుపోయిన ప్రయాణికులను తరలించడానికి టెర్మినల్ ఆపరేషన్స్ సిబ్బంది, ఎయిర్ సైడ్ ఆపరేషన్స్, ల్యాండ్ సైడ్ సెక్యూరిటీ, సీ.ఐ.ఎస్.ఎఫ్., ఇమిగ్రేషన్, కస్టమ్స్, ఎయిర్ పోర్ట్ హెల్త్ ఆఫీసర్స్, ఎయిర్ లైన్ గ్రౌండ్ హ్యాండ్లర్లు, ఎయిర్ పోర్ట్ రెస్క్యూ అండ్ ఫైర్ ఫైటింగ్ సేవలు, సెక్యూరిటీ, ట్రాలీ ఆపరేటర్లు, హౌస్ కీపింగ్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు.  
 
టెర్మినల్‌లో ప్రవేశించే ముందు ప్రయాణికులందరికీ కోవిడ్-19 థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. స్పెషల్ స్క్రీనింగ్, పలు భద్రతా చర్యల అనంతరం, తగిన భౌతిక దూరాన్ని పాటిస్తూ వారు ప్యాసింజర్ ప్రాసెసింగ్ పాయింట్స్ ను దాటుకుని విమానంలోకి వెళ్లారు.  
 
మార్చి 31న హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చెన్నై నుంచి ఇక్కడికి వచ్చిన ఎయిరిండియా ప్రత్యేక విమానం ద్వారా 38 మంది జర్మనీ జాతీయులను వారి స్వదేశానికి తరలించేందుకు సహాయపడింది.

మార్చి 28న ఇండిగోకు చెందిన ప్రత్యేక మెడికల్ ఎవాక్యుకేషన్ విమానం కూడా హైదరాబాద్‌లో దిగి, తన 8 మంది సిబ్బందిని హైదరాబాద్‌లో దింపి, ఇక్కడ చిక్కుకుపోయిన ఐదుగురు సిబ్బందితో చెన్నైకు తరలివెళ్లింది. 
 
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒకవైపు నిరంతరం తరలింపు విమానాలను హ్యాండిల్ చేస్తూనే మరో వైపు సప్లై చెయిన్ విమానాలు నడిచేందుకు నిరంతరం సహకరిస్తూ, దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల సప్లై చెయిన్ ఎలాంటి ఆటంకాలూ లేకుండా కొనసాగేందుకు కృషి చేస్తోంది.

గ్రౌండ్ హ్యండ్లరు, ఫార్వర్డర్లు, కస్టమ్స్ హౌస్ ఏజెంట్లు, రెగ్యులేటర్లు, రాష్ట్ర పోలీసులు, కార్గో ట్రేడ్ అసోసియేషన్లతో కలిసి అత్యవసర వస్తువులైన ఔషధాలు, వ్యాక్సిన్లు, మెడికల్ ఎక్విప్ మెంట్, ఫార్మా ముడి పదార్థాలు, రక్షణ పరికరాలు, బ్యాంకు సంబంధిత వస్తువులు నిరంతరం రవాణా కొనసాగేందుకు కృషి చేస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు