హిమాచల్ ప్రదేశ్‌లో మంచు సునామీ.. శిమ్లాలో భారీ వర్షం

బుధవారం, 25 నవంబరు 2020 (12:18 IST)
హిమాచల్ ప్రదేశ్‌లో మంచు సునామీ ప్రారంభమైంది. హిమాచల్ ప్రదేశ్‌లోని పర్వత ప్రాంతాలలో భారీగా మంచుకురుస్తోంది. రాష్ట్రంలోని 8 జిల్లాలలో భారీ వర్షాలు, హిమపాతం కుస్తుస్తున్న నేపథ్యంలో అలర్ట్ ప్రకటించారు. శిమ్లా, మనాలీలో భారీగా మంచు కురుస్తోంది. 
 
మనాలీలోని అటల్ టన్నల్‌కు చెందిన నార్త్ పోర్టల్ వద్ద భారీగా మంచు పేరుకుపోయింది. దీంతో లేహ్- మనాలీ హైవే మూసుకుపోయింది. ఫలితంగా వాహన రాకపోకలు నిలిచిపోయాయి. లాహోల్ స్పీతిలో కూడా ఇటువంటి పరిస్థితులే నెలకొన్నాయి. 
 
కులూ, లాహోల్‌లో వరుసగా రెండవ రోజు కూడా భారీగా మంచు కురుస్తోంది. శిమ్లాలో భారీ వర్షం కురుస్తోంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని పర్వతప్రాంతాలలో బుధవారంభారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు