రాత్రికి రాత్రే రూ.500 రూ.1000 నోట్లను రద్దు చేయడంతో చిల్లర కొరతతో పాటు, ఏటీఎంలు, బ్యాంకులు కూడా రద్దు కావడంతో.. సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న ఈ నిర్ణయంతో సామాన్య ప్రజానీకానికి కష్టాలు తప్పవని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అయితే కొన్ని కష్టాలు ఎదుర్కొనేందుకు, త్యాగాలు చేసేందుకు మన ప్రజలు ఎప్పుడూ వెనుకడగు వేయరని మోడీ కొనియాడారు.
అవినీతి, నల్లధనం, ఉగ్రవాదం, నకిలీ కరెన్సీపై పోరాటంలో తాము కొంత కష్టం, అది కూడా కొన్ని రోజులపాటు భరించేందుకు సిద్ధమే అని ప్రజలు భావిస్తున్నారు. దేశ అభివృద్ధి ప్రక్రియలో, దేశ హితం కోసం జరిగే నిర్మాణంలో అంతా భాగస్వామి కావాలని మోడీ విజ్ఞప్తి చేశారు. పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు ఎదురైనా.. ప్రజలు సహకరిస్తేనే నల్లధనంపై కొరడా ఝళిపించేందుకు సిద్ధం కావాలన్నారు.