దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌కు రాజకీయాల్లో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తమిళనాట రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న ఆమెకు ఆదిలోనే కష్టాలు తప్పలేదు. ఉప ఎన్నికల్లో ఆర్కే నగర్ నుంచి ఆమెను పోటీ చేయకుండా విరమింపజేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి. ఓపీఎస్ దూరంగా ఉండాలనుకున్న దీప.. ఆర్కే నగర్‌లో ఒంటరి పోరాటానికి సిద్ధమయ్యారు.
అయితే ఏప్రిల్ 12న ఆర్కేనగర్ నియోజకవర్గ బైపోల్‌లో పోటీ చేయకూడదంటూ ఆమెకు బెదిరింపులు వస్తున్నాయట. ఈ సీటు నుంచి పోటీ చేయాలని తాను స్టేట్‌మెంట్ చేసినప్పటి నుంచి రకారకాలుగా వేధిస్తున్నారని దీప ఆరోపించారు. కనీసం తాను ఇంట్లో కూడా ఉండలేకపోతున్నానని, పలువురు గూండాలు అక్కడికి వస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అసలు వారు ఎవరికి చెందినవారో తనకు తెలియట్లేదని దీప ఆరోపణలు గుప్పించారు.