గంగానదిని అలా పవిత్రం చేస్తున్నారా?

సోమవారం, 21 జనవరి 2019 (13:33 IST)
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవిత్ర గంగానదిని శుద్ధి చేస్తామని హామీ ఇచ్చింది. ఇందుకోసం ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గత నాలుగేళ్ల పాటు తనకు వచ్చిన కానుకలు, బహుమతులను వేలం వేసి.. ఆ డబ్బుతో గంగానదిని శుద్దీకరించాలని నిర్ణయించారు. 
 
గత 2014లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి.. ప్రధానిగా పగ్గాలు చేపట్టిన నరేంద్ర మోదీకి.. ఈ నాలుగేళ్ల కాలంలో.. తలకట్టు, సాలువ, చిత్ర పటాలు, ఫోటోలతో పాటు 1800 పైబడిన కానుకలు వచ్చాయి.

ఈ వస్తువులు ఢిల్లీలో భద్రపరిచారు. ప్రస్తుతం ఈ వస్తువుల కోసం వేల పాట పాడనున్నారు. తద్వారా వచ్చే నగదును గంగానదిని శుభ్రం చేసేందుకు ఉపయోగించనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు