'లాక్‌డౌన్ పొడగింపు రూమర్ల'పై కేంద్రం స్పందన

సోమవారం, 30 మార్చి 2020 (10:28 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి బారినపడకుండా ఉండేందుకు అనేక ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. ఇందులోభాగంగా, మన దేశంలో కూడా సంపూర్ణ లాక్‌డౌన్ అమలవుతోంది. ఇది ఏప్రిల్ 15వ తేదీతో ముగియనుంది. అయితే, ఈ లాక్‌డౌన్‌ను ఏప్రిల్ నెలాఖరు వరకు పొడగించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. 
 
దీనిపై కేంద్రం స్పందించింది. ఈ వార్తలు నిరాధారమైనవని సోమవారం ఉదయం కేంద్ర ప్రభుత్వ అధికారిక మీడియా విభాగం పీటీఐ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) వెల్లడించింది. 'కొన్ని రూమర్లు మీడియాలో ప్రచారం అవుతున్నాయి. 21 రోజుల లాక్ డౌన్ ముగిసిన తరువాత దాన్ని పొడిగిస్తారనడం నిరాధారం. కేంద్ర కార్యదర్శులు సైతం ఈ విషయాన్ని కొట్టి పారేస్తున్నారు' అని వివరణ ఇచ్చింది. 
 
కాగా, ఈ వార్తలు తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా వ్యాఖ్యానించారు. లాక్ డౌన్‌ను పొడిగించే ఎటువంటి ఆలోచనా కేంద్రం చేయడం లేదని అన్నారు. అయితే, ఏప్రిల్ 15వ తేదీ వరకు ఖచ్చితంగా లాక్‌డౌన్ పాటిస్తూ, ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్ళకే పరిమితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు