పార్లమెంట్‌లో వ్యవసాయ బిల్లులపై క్రమంగా పెరుగుతున్న వ్యతిరేకత

శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (22:00 IST)
పార్లమెంట్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై క్రమంగా వ్యతిరేకత పెరుగుతుంది. ఈ బిల్లులను వ్యతిరేకించిన బీజేపీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ దారిలోనే మరికొన్ని ఉత్తరాది పార్టీలు ఉన్నాయి.
 
హర్యానాలో బిజేపి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా ఉన్న “జననాయక్‌ జనతా పార్టీ” (జేజేపీ) ఎన్డీయే నుంచి వైదొలిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
 
ప్రస్తుతం హర్యానా డిప్యూటీ సీఎంగా జేజేపీ చీఫ్‌ దుశ్యంత్‌ సింగ్‌ చౌతాలా కొనసాగుతున్నారు.
 90 స్థానాలు ఉన్న హరియాణాలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖట్టర్‌ నేతృత్వంలో బీజేపీ 40 స్థానాలు సాధించి.. అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ (46) లేదు.
 
పది స్థానాలలో గెలిచి కింగ్‌మేకర్‌గా దుష్యంత్‌ చౌతాలా నిలబడ్డారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం నుంచి “జననాయక్‌ జనతా పార్టీ” వైదొలిగితే ఖట్టర్‌ ప్రభుత్వం కుప్పకూలే అవకాశం వుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు