పబ్జీ గేమ్‌కు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా సోషల్‌మీడియాలో ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. పెళ్లిలో వరుడు పబ్జీ ఆడుతున్న సమయంలో తీసిన వీడియో అది. పక్కనే వధువు ఉన్నా కూడా పట్టించుకోకుండా పబ్జీ ఆడుతూ గడిపిన వరుడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
అతిథులు వచ్చి కానుకలు ఇస్తూ విష్ చేస్తుంటే వాటిని పక్కకు నెట్టేసి మరీ ఆటలో మునిగిపోయాడు. తాళికట్టిన మరుక్షణమే.. వరుడు హ్యాపీగా.. స్మార్ట్‌ఫోన్‌లో పబ్జీ గేమ్ ఆడుతూ గడిపాడు.
దాంతో పక్కనే ఉన్న వధువు ఏం చేయాలో తెలియక ఫోన్‌లోకి తొంగిచూస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోపై నెటిజన్లు విభిన్న కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను చూసి నవ్వుకుంటున్నారు.
కానీ ఈ వీడియోను నిజంగానే వరుడు పబ్జీ ఆడుతున్నప్పుడు వీడియో తీశారా? లేక పెళ్లి సందర్భంగా టిక్‌టాక్ వీడియోను రూపొందించేందుకు కావాలని ఇలా చేశారా అనేది తెలియరాలేదు. మొత్తానికి పబ్జీ గేమ్‌కు, టిక్‌టాక్‌కు నెటిజన్లు బాగా అడిక్ట్ అవుతున్నారన్నమాట.