ఇటీవలికాలంలో వివిధ రకాల యాప్ గేమ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి గేమ్స్‌ను పిల్లలు అధికంగా ఆడుతుంటారు. కానీ, పబ్‌జీ వంటి గేమ్స్ వచ్చాక.. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఆడుతున్నారు. ఈ పబ్‌జీ గేమ్‌కు బానిసలైన అనేక మంది యువతీయువకులు ప్రాణాలు కోల్పోతున్న సంఘటను విన్నాం.
కానీ, ఇపుడో మహిళ ఏకంగా భర్త నుంచి విడాకులు కోరింది. తన భర్త పబ్‌జీ గేమ్ ఆడుకోనివ్వడం లేదని అందువల్ల తనకు విడాకులు మంజూరు చేయాలని కోరింది. దీంతో ఖంగుతిన్న అధికారులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. యూఏఈలోని అజ్మన్‌లో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
అజ్మన్‌కు చెందిన 20 యేళ్ళ యువతికి వివాహమైంది. కానీ, పిల్లలు లేరు. ఈమె అజ్మన్ పోలీసుల శాఖకు చెందిన సోషల్ సెంటర్‌కు వెళ్లి ఓ ఫిర్యాదు చేసింది. 'నన్ను నా భర్త పబ్‌జీ గేమ్ ఆడుకోనివ్వడం లేదు. మాకు విడాకులు ఇప్పించండి' అని విజ్ఞప్తి చేసింది. దీంతో ఖంగుతిన్న అధికారులు ఆమెను కూర్చొబెట్టి, ఆమె భర్తను పిలిపించి మాట్లాడారు.