గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపులో గుజరాత్‌లో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పార్టీలు నువ్వా? నేనా? అన్న రీతిలో కొనసాగుతున్నాయి. ఇకపోతే, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం బీజేపీ విజయభేరీ మోగించనుంది. ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయే అవకాశం ఉంది.
కాగా, ఉదయం 9 గంటలకు ఓట్ల లెక్కింపు ట్రెండ్ మేరకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ 16 చోట్ల, కాంగ్రెస్ 9 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. అలాగే, గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ 100 చోట్ల, కాంగ్రెస్ పార్టీ 63 చోట్ల, ఇతరులు 2 చోట్ల లీడ్‌లో కొనసాగుతున్నారు.