మంచి మార్కులేస్తానని ఉపాధ్యాయుడు అనేక సార్లు అత్యాచారం చేశాడు.. ఎక్కడ?

మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (19:55 IST)
బాలికలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. పదో తరగతి వార్షిక పరీక్షల్లో మంచి మార్కులేస్తానని నమ్మించిన ఓ ఉపాధ్యాయుడు ఓ విద్యార్థినిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం పదో తరగతి చదువుకున్న బాలిక ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని మెహన్సా జిల్లా పరిధిలోని విసానగర్‌కు చెందిన ఓ ఉపాధ్యాయుడు రాజేష్ పటేల్ ఇంటి వద్ద విద్యార్థులకు ట్యూషన్లు చెప్పేవాడు. అతడు పనిచేస్తున్న పాఠశాలలోనే చదువుతున్న పదో తరగతి బాలిక అతడి వద్దకు ట్యూషన్‌కు వెళ్లేది. 

ఈ క్రమంలో ఆ బాలికపై మనసు పారేసుకున్న ఆ కామాంధుడు... పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు వేయిస్తానని నమ్మబలికాడు. దీంతో ఆ విద్యార్థిని కామాంధుడైన ఉపాధ్యాయుడి చేతిలో నలిగిపోయింది. ఇలా కొన్ని నెలల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధిత విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి