రైతులకు వ్యవసాయ క్రెడిట్ కార్డులు

సోమవారం, 9 మే 2022 (13:47 IST)
హర్యానా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలోని అన్నదాతలను ఆదుకునేందుకుగాను వ్యవసాయం చేసుకునే రైతులకు క్రెడిట్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. రైతులు ఆర్థికంగా నిలదొక్కునేందుకు వీలుగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ఇదొకటి. 
 
ఇందులోభగాంగా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవానీ బీమా యోజన, పసల్ క్రెడిట్ కార్డు పథకాలను ప్రారంభించారు. ఈ క్రెడిట్ కార్డులను హర్యానా గ్రామీణ బ్యాంక్ తరపున జారీచేశారు. 
 
రైతు సంక్షేమ శాఖామంత్రి జైప్రకాష్ దలాల్ చర్కి దాద్రిలోని చందవాస్ గ్రామంలో పశుపోషణ కోసం రైతులకు సర్వ హర్యానా గ్రామీణ బ్యాంకు నుంచి క్రెడిట్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 12 గ్రామాలకు చెందిన 325 మంది రైతులకు రూ.5 కోట్లతో వ్యవసాయం, పశుసంవర్థక రుణం కార్డులను మంత్రి అందజేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు