ఈమె తన ఎన్నికల ప్రచారాన్ని మధురలోని గోవర్ధన్ క్షేత్రం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా రోడ్డు పక్కనే ఉన్న గోధుమ పొలంలోకి వెళ్లిన హేమమాలిని కొడవలి చేతబట్టి మిగతా మహిళల మాదిరిగా ఆ పేరును కోశారు. దీన్ని ఆమె ట్వీట్ చేశారు. "గోవర్ధన్ క్షేత్ర నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాను. ఇక్కడి మహిళలతో పొలాల్లో కలిసి మాట్లాడడం అదృష్టంగా భావిస్తున్నా" అని హేమమాలిని ట్వీట్ చేశారు.
పైగా, తనను ఇక్కడి ప్రజలు అమితంగా స్వాగతిస్తున్నారని, అందుకు తాను గర్విస్తున్నట్టు చెప్పారు. మధుర ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేశానని చెప్పారు. 2014 సాధారణ ఎన్నికల్లో కూడా హేమమాలిని ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు.