ప్ర‌ధాని మోదీ భద్రతా వైఫ‌ల్యంపై కేంద్రం సీరియస్

శుక్రవారం, 7 జనవరి 2022 (11:41 IST)
పంజాబ్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని మోదీకి భద్రతా వైఫ‌ల్యంపై కేంద్ర హోం శాఖ‌, సుప్రీం కోర్టు సీరియ‌స్ అయ్యింది. ఈ క్ర‌మంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతు తెలిపారు. పంజాబ్‌ పర్యటనలో ప్రధానమంత్రి న‌రేంద్ర మోదీకి భద్రతా వైఫల్యం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 
 
భారీ భద్రతా వైఫల్యం కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌ పర్యటన అర్ధాంతరంగా ముగిసింది. ప్రధాని కాన్వాయ్‌ మార్గాన్ని కొందరు నిరసనకారులు అడ్డుకోవడంతో ఆయన సుమారు 20 నిమిషాలు ఒక ఫ్లైఓవర్‌పై నిలిచిపోయారు. 
 
ఇప్ప‌టికే ఈ ఘ‌ట‌న‌పై  కేంద్ర హోం శాఖ చాలా సీరియస్ అయ్యింది. ఈ నిర్ల‌క్ష్యంపై తగిన వివరణ ఇవ్వాలని పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రధాని పర్యటన సందర్భంగా భద్రతా నిర్లక్ష్యం చేయడం పూర్తిగా ఆమోదయోగ్యం కాదని, జవాబుదారీతనం పరిష్కరించబడుతుందని హోంమంత్రి అమిత్ షా అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు