యూపీ, ఆగ్రాలో దారుణం చోటుచేసుకుంది. ఓ హోంస్టేలో పనిచేస్తున్న యువతిపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ఐదుగురినీ పోలీసులు అరెస్ట్ చేశారు.