ఈ వివరాలను పరిశీలిస్తే, గ్రీన్ పార్క్ కాలనీకి చెందిన రవికిరణ్ కర్మాన్ ఘాట్‌లోని నియో రాయల్ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. తోటి విద్యార్థులు కలసి ర్యాగింగ్ చేసి డబ్బులు తీసుకొని రావాలని బెదిరిచడంతో తల్లిదండ్రులకు తెలియకుండా రూ.6 వేలు ఇచ్చిన రవికిరణ్... మళ్లీ డబ్బులు తేవాలని బెదిరిచడంతో స్కూల్ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశాడు. అయితే, దీనిపై ప్రిన్స్‌పాల్ లేదా స్కూల్ యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోలేదు.
దీంతో ఆ విద్యార్థి మానసిక వేదనకు లోనయ్యాడు. పైగా, రవికిరణ్‌కు ఈ తరహా వేధింపులు తప్పలేదు. దీంతో ఈ వేధింపులను తాను భరించలేనని లెటర్ రాసిపెట్టి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అతన్ని కుటుంబ సభ్యులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ విద్యార్థి ఎల్బీనగర్‌లోని గ్లోబల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.