రిషబ్ పంత్‌ను రక్షించిన బస్సు డ్రైవర్ - లేకుంటే కారులోనే సజీవదహనం

శుక్రవారం, 30 డిశెంబరు 2022 (16:25 IST)
ఘోర రోడ్డు ప్రమాదం నుంచి క్రికెటర్ రిషభ్ పంత్‌ను ఓ బస్సు డ్రైవర్ రక్షించాడు. లేకపోతే, అతను కారులోనే సజీవ దహనమైపోయేవాడు. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వెళుతుండగా, ఆయన ప్రయాణిస్తున్న బెంజ్ కారు డివైడర్‌ను ఢీకొన్న విషయం తెల్సిందే. ఈ ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డారు. కారు పూర్తిగా దగ్ధమైపోయింది. ప్రస్తుతం పంత్ డెహ్రాడూన్‌లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు, పంత్ కారుకు ప్రమాదం జరిగిన వెంటనే ఆయను రక్షించిన వారిలో హర్యానా రోడ్ వేస్‌కు చెందిన బస్సు డ్రైవర్ కూడా ఉన్నారు.
 
ఏం జరిగిందో బసు డ్రైవర్ సుశీల్ మాన్ మీడియాకు వివరిస్తూ, ఎదురుగా చాలా వేగంతో వస్తున్ కారు డివైడర్‌ను ఢీకొట్టిందని తెలిపారు. ఆ వెంటనే తాను బస్సును ఆపేశామన్నారు. వాస్తవానికి పల్టీలు కొట్టుకుంటూ వచ్చి కారు బస్సు కిందకు దూరుతుందని భావించామన్నారు. అయితే, కారు బస్సు సమీపానికి వచ్చి ఆగిపోయిందన్నారు. కిటికీ నుంచి డ్రైవర్ శరీరం సగం బయటకు వచ్చిందని తాను క్రికెటర్ అని ఆయన చెప్పారని, తన తల్లికి ఫోన్ చేయమని తమన కోరాడని కానీ, ఆయన ఫోన్ స్విచాఫ్ అయిపోయిందన్నారు. 
 
రిషబ్ పంత్ ఒక క్రికెటర్ అని తనకు తెలియదన్నారు. ఎందుకంటే తాను క్రికెట్ చూడనని చెప్పారు. అయితే, బస్సులోని ప్రయాణికులు రిషబ్ పంత్‌ను గుర్తించారని తెలిపారు. ఆ వెంటనే మేమంతా కలిసి ఆయన్ను రక్షించి, కారులో ఉన్న ఒక బ్లూ బ్యాగును, రూ.7 నుంచి రూ.8 వేల డబ్బును కారు నుంచి తీశామన్నారు. అంబులెన్స్‌లో ఎక్కించిన తర్వాత వాటిని ఆయనకు ఇచ్చామన్నారు. ప్రమాద సమయానికి బస్సు అక్కడకు రావడం వల్లే కారు నుంచి పంత్‌ను బయటకు లాగడంతో ప్రాణాలతో బయటపడ్డాడని లేకపోతే కారులోనే సజీవదహనమైపోయివుండేవాడని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు