సుస్మితా సేన్ పెళ్లి కాకుండానే ఇద్దరూ ఆడ పిల్లలను దత్తత తీసుకుని తల్లయ్యారు. ఈ మాజీ బ్యూటీ క్వీన్ మోడల్ రోహమన్ షాల్‌తో కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. రోహమన్, ఆమెకు మధ్య 15 సంవత్సరాలు వ్యత్యాసం ఉంది. అంటే సుస్మిత కంటే రోహమన్ 15 ఏళ్ల చిన్నవాడు.
ఇక ఏదేమైనా మేము మా బంధంతో చాలా సంతోషంగా ఉన్నాం. నేను నా పిల్లలు, రోహమన్ ఓ కుటుంబం అని పేర్కొన్నారు. అయితే మహిళగా నాకు ఓ తోడు అవసరమని, ఓ వ్యక్తి సావాసం కోరుకునేంత రోమాంటిక్ నేను కాదు. జీవితంలో ఎప్పుడూ నేను అలా ఆలోచించలేదు. రోహమన్‌తో పరిచయం అనుకోకుండా ఏర్పడింది.