తమ పెంపుడు కుక్కతో క్రీడా మైదానంలో వాకింగ్ చేసేందుకు ఆ స్టేడియంలోని క్రీడాకారులను బలవంతంగా బయటకు పంపించారు. దీనిపై మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ ఘటనపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆ ఐఏఎస్ అధికారిణితో బలవంతంగా రాజీనామా చేయించింది. ఆమె పేరు రింకూ దుగ్గా. ఈ వివరాలను పరిశీలిస్తే,
ఈ క్రమంలో, పెంపుడు కుక్కను వాకింగ్ చేయించేందుకు రింకూ, ఆమె భర్త ఈ మైదానాన్ని వాడుకోవడం ప్రారంభించారు. ఈ జంట ఆదేశాల మేరకు నిర్వాహకులు నిర్ణీత సమయానికంటే ముందే క్రీడాకారులను బయటకు పంపించసాగారు. దీనిపై మీడియాలో కథనాలు వచ్చాయి.
దీనిపై కేంద్రం కన్నెర్ర జేసింది. ప్రభుత్వ అధికారుల ప్రాథమిక నిబంధనలు, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ నిబంధనల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏ గవర్నమెంట్ ఉద్యోగినైనా ముందస్తుగా పదవీ విరమణ చేయమని కోరే హక్కు ప్రభుత్వానికి ఉంది. దీంతో రింకూ తన ఉద్యోగం పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఆమె భర్త సంజీవ్ ఖిర్వార్ లద్దాక్‌లో విధులు నిర్వహిస్తున్నారు.