కోవిడ్-19 వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. దానిలో టీకా తీసుకున్న వ్యక్తి పేరు, ఇతర వ్యక్తిగత వివరాలు ఉంటాయని పేర్కొంది. మోసగాళ్లు ఎవరైనా ఈ సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశాలున్నాయని పేర్కొంది.
దేశంలో కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో 18 ఏళ్ల వయసు దాటిన వారందరికీ టీకాలు వేస్తున్నారు. ఈ నేపధ్యంలో వ్యాక్సినేషన్ స్లాట్ బుక్ చేయడంలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కోవిడ్-19 వ్యాక్సిన్ వేసిన తరువాత సంబంధిత వ్యక్తికి ప్రభుత్వం వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ జారీ చేస్తుంది.